శనివారం, 25 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

31-03-2020 మంగళవారం దినఫలాలు - మహాలక్ష్మిని ఆరాధించినా..

మేషం : విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎండుమిర్చి, కంది, పసుపు, ఉల్లి, బెల్లం వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. ఉద్యోగస్తులకు ప్రమోషన్, బదిలీ ఉత్తర్వులు అందుతాయి. రిప్రజెంటేటివ్‌లు మార్పులకై చేయు ప్రయత్నాలు వాయిదాపడతాయి. 
 
వృషభం : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా నెమ్మెదిగా సమసిపోతాయి. రాజకీయల్లో వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. గృహ నిర్మాణాలలో వ్యయం మీ అంచనాలను మించుతుంది. మీ జీవిత భాగస్వామితో కీలకమైన విషయాలు చర్చలు జరుపుతారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. 
 
మిథునం : సిమెంట్, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేయవలసి ఉంటుంది. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు ఏకాగ్రత చాలా అవసరం. పత్రికా, ప్రైవేటు సంస్థలలోనివారికి యాజమాన్యం తీరు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. 
 
కర్కాటకం : బంధువులు మీ స్థోమతకు తగిన వివాహ సమాచారం అందిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు చేసుకోగలుగుతారు. మొహమ్మాటాలు, ఒత్తిళ్ల వల్ల ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 
 
సింహం : విద్యార్థులు తొందరపాటుతనం వదిలి ఏకాగ్రతతో చవిదిన సత్ఫలితాలను పొందగలరు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం కావడంతో శ్రమాధిక్యత తప్పదు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి. అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తాయి. 
 
కన్య : ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. మిత్రుల నుంచి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. తలపెట్టిన పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికం. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. ప్రముఖుల సహకారంతో మీ పాత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. 
 
తుల : ఉద్యోగస్తులకు ఆకస్మిక బదిలీ, బాధ్యతల మార్పులు ఉంటాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. సంఘంలో పలుకుబడికలిగిన వ్యక్తుల సహకారం మీకు లభిస్తుంది. స్వయంకృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
వృశ్చికం : వ్యాపారాల్లో నిలదొక్కుకోవడంతో పాటు అనుభవం గడిస్తారు. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. స్త్రీలకు కొత్త పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. గృహంలో ఏదైనా వస్తువు పోయేందుకు ఆస్కారం ఉంది. మెలకువ వహించండి. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. 

ధనస్సు : ఉద్యోగస్తులు పెండింగ్ పనులు పూర్తి చేసి అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఆపద సమయంలో సన్నిహితులు అండగా నిలుసుత్రాు. స్టాక్ మార్కెట్ రంగాలవారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడం మంచిదేనని భావించండి. 
 
మకరం : కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలతో మితంగా సంభాషించండి. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. పెంపుడు జంతువుల పట్ల ఆందోళన చెందుతారు. కుటుంబీకుల కోసం ధనం బాగా వ్యయం చేయవలసి వస్తుంది. 
 
కుంభం : ఆర్థిక లావాదేవీలు గోప్యంగా ఉంచండి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు ఏమాత్రం అనుకూలించవవు. స్త్రీలకు కాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. ఉన్నత స్థాయి అధికారుల ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. కోర్టు వ్యవహారాలు, ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
మీనం : చిన్నారుల మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి శ్రమ అధికమవుతుంది. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. బంధువులకు ధన సహాయం చేయడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు.