ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

01-04-2020 బుధవారం రాశిఫలాలు - నరసింహ స్వామిని పూజిస్తే

మేషం : వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన మార్పులుంటాయి. ఆస్తి వ్యవహారాల్లో కుటుంబీకులతో ఏకాభిప్రాయం కుదరదు. దైవ, సేవా, పుణ్య కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. గృహోపకరణాలు, వాహనం సమకూర్చుకుంటారు. పాత మిత్రుల కలయికతో మీలో కొంత మార్పు వస్తుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. 
 
వృషభం : నిత్యావసరవస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు అనుకూలం. ఒక కార్యం నిమిత్తం దూరప్రయామం చేయవలసి వస్తుంది. మీ సంతానం విద్యా, వివాహ విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. దూరంగా ఉన్న ఆత్మీయులను కలుసుకోవాలనే కోరిక స్ఫురిస్తుంది. సోదరులతో ఆస్తి విషయమై సంప్రదింపులు జరుపుతారు. 
 
మిథునం : రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లలో ప్రతికూలత ఎదుర్కోవలసి వస్తుంది. పెద్దల గురించి అప్రియమైన వార్తలు అందుతాయి. ప్రయాణాల్లో మెలకువ వహించండి. భాగస్వామిక చర్చల్లో మీదే పైచేయిగా ఉంటుంది. కవి పండితులకు, ప్రముఖులకు ఆదరణ లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. 
 
కర్కాటకం : రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు ఆశిస్తున్న ప్రమోషన్ త్వరలోనే అందుతుంది. ప్రయాణాలు, తీర్థయాత్రలు అనుకూలిస్తాయి. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. గతంలో ఒకరికి హామీ ఉండటం వల్ల ఇబ్బందులెదురవుతాయి. వృత్తుల క్యాటరింగ్ పనివారలకు చికాకులు అధికం. 
 
సింహం : రావలసిన ధనం చేతికందుతుంది. ఇతరులకు అతి చనువు ఇవ్వడం మంచిదికాదదని గమనించండి. స్త్రీలకు బంధు వర్గాల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు. అప్రయత్నంగా కొన్ని వ్యవహారాలు అనుకూలిస్తాయి. 
 
కన్య : ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. ప్రేమికులకు ఎడబాటు, చికాకులు ఎదుర్కొంటారు. ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ఎంతో ముఖ్యం. వృత్తుల వారికి శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. 
 
తుల : మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. స్త్రీలకు ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. మిత్రులకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. ఉద్యోగస్తులకు రావలసిన క్లైమ్‌లు, అలవెన్సులు మంజూరవుతాయి. 
 
వృశ్చికం : చిన్న చిన్న సమస్యలెదురైనా పరిష్కరించుకుంటారు. బంధుమిత్రుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ఏదైనా స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. కుటుంబ సౌఖ్యం, వాహనయోగం పొందుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ముఖ్యం. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. 
 
ధనస్సు : వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. ప్రైవేటు సంస్థలలోని వారికి తోటివారివల్ల మాటపడక తప్పదు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఆదాయ వ్యయాల విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులకు అప్పగించిన బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. 
 
మకరం : కొబ్బరి, పండ్లు, పూల, పానీయ వ్యాపారులకు ఆశాజనకం. ఆస్తి వ్యవహారాల్లో సోదరులతో అవగాహన ఏర్పడుతుంది. ప్రముఖుల సహకారంతో ఒక వ్యవహారం మీకు అనుకూలిస్తుంది. ఉద్యోగస్తులకు అప్పగించిన బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. నూతన కాంట్రాక్టులకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు. 
 
కుంభం : గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. విదేశీయాన యత్నాల్లో ఆటంకాలు తప్పవు. ఒక వ్యవహారలో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారు. ప్రయాణాలలో స్వల్ప చికాకులు తప్పవు. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు. వాతావరణంలో వచ్చి మార్పు, శారీరక శ్రమ వల్ల మీ ఆరోగ్యం మందగిస్తుంది. 
 
మీనం : ఆర్థికస్థితి మునపటికంటే కొంత మెరుగ్గా ఉంటుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. బంధువులను కలుసుకుంటారు. చిన్నచిన్న సమస్యలెదురైనా పరిష్కరించుకుంటారు. నూతన పెట్టుబడులు పెట్టునపుడు పునరాలోచన చాలా అవసరం. చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తిచేస్తారు.