మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

02-04-2020 గురువారం మీ రాశిఫలాలు - దత్తాత్రేయుడిని పూజిస్తే...

మేషం : రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది. మీ కార్యక్రమాలు, పనులు అనుకున్నత చురుకుగా సాగవు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. ఓ మంచి వ్యక్తి అభిమానాన్ని పొందుతారు. 
 
వృషభం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి శుభం చేకూరుతుంది. కోర్టు వ్యవహారాలు ముందుకుసాగక నిరుత్సాహం చెందుతారు. క్రయ విక్రయాలు లాభిస్తాయి. మీ యత్నాలు కొంత ఆలస్యంగానైనా పరిపూర్ణంగా పూర్తవుతాయి. దైవదీక్షల పట్ల ఆసక్తి నెలకొంటుంది. అవివాహితులు కొత్త అనుభూతికి లోనవుతారు. 
 
మిథునం : రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. భాగస్వామిక చర్చలు అర్థాంతరంగా ముగుస్తాయి. కుటుంబీకులతో సామరస్యంగా మెలగండి. వాహనం వీలైనంత నిదానంగా నడపడం మంచిది. మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే సంఘటన లెదురవుతాయి. 
 
కర్కాటకం : వృత్తి వ్యాపారాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. కృషి రంగానికి అవసరమైన వస్తువులు సమకూర్చుకుంటారు. వస్త్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరగలవు. కొబ్బరి, పానీయ వ్యాపారులకు కలిసివచ్చే కాలం. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. 
 
సింహం : తలకు మించిన బాధ్యతలతో తలముకలౌతుంటే కాస్త ఓపికగా వ్యవహరించండి. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించేవారుండరు. ప్రముఖుల కలయిక సాధ్యంకాకపోవచ్చు. నూతన వ్యాపారాలపట్ల మెలకువ వహించండి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. దూర ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. 
 
కన్య : భవిష్యత్ ప్రణాళికలు గురించి జీవిత భాగస్వామితో చర్చిస్తారు. చేపట్టిన పనులు సక్రమంగా నిర్వహించలేకపోతారు. దూర ప్రయాణాలలో ఒత్తిడిని, చికాకులను ఎదుర్కొంటారు. బ్రోకర్లకు, ఏజెంట్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఒత్తిడి తప్పదు. ఉద్యోగస్తుల క్రమశిక్షణ, పనితీరు అధికారులను ఆకట్టుకుంటుంది. 

తుల : స్త్రీలకు ఆహార, ఆరోగ్యంలో జాగ్రత్త అవరం. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచండి. హోటల్, తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తికానవచ్చును. మీ మిత్రుల కోసం బంధువుల కోసం బరువు బాధ్యతలు స్వీకరిస్తారు. ఇతరుల కారణాల వల్ల మీ కార్యక్రమాలు వాయిదాపడతాయి. 
 
వృశ్చికం : విద్యార్థినిలు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ఆదాయ వ్యయాలు మీ బడ్జెట్‌కు అనుగుణంగానే ఉంటాయి. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. ప్రతి విషయంలోనూ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. 
 
ధనస్సు : ధనియాలు, ఆవాలు, పసుపు, నూనె వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు అనుకూలంగా ఉండగలదు. పనివారలతో సమస్యలు తలెత్తగలవు. జాగ్రత్త వహించండి. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు స్పందన అంతగా ఉండదు. కాంట్రాక్టర్లకు రావలిసిన బిల్లులు మంజూరవుతాయి. తోటివారి నుంచి స్వల్ప పేచీలు ఉండగలవు. 
 
మకరం : ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. ఎప్పటి నుంచో వాయిదాపడుతూవస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ప్రమాదాలు, వివాదాస్పదాల్లో ఇరుక్కునే ఆస్కారం ఉంది. కొత్త రుణాల కోసం యత్నిస్తారు. రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
కుంభం : ప్రైవేటు సంస్థలలో వారికి ఓర్పు, సహనం ఎంతో ముఖ్యం. వృత్తుల వారికి ఆర్థిక సంతృప్తి ఆశించినంతగా ఉండదు. ముఖ్యులతో ఆంతరంగిక విషయాలను చర్చిస్తారు. నిరుద్యోగులకు ఆశాజనకం. గృహ నిర్మాణాలు, మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి యత్నించండి. 
 
మీనం : కొన్ని వ్యవహారాలు ధనవ్యయంతో సానుకూలమవుతాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. రుణ విముక్తులు కావడంతో పాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి. అపరిచితుల వల్ల సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలలో హాజరుకావడం ఉత్తమం.