ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 మే 2020 (18:33 IST)

''వర్క్ ఫ్రమ్ హోమ్‌'' వద్దు.. ఉద్యోగులకు అది దెబ్బే.. సత్య నాదెళ్ల

వర్క్ ఫ్రమ్ హోమ్‌పై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేయించాలని ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ సూచిస్తున్న తరుణంలో సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. శాశ్వతంగా ఉద్యోగుల చేత వర్క్ ఫ్రం హోం చేయించడంవారి మానసిక ఆరోగ్యంపై పెను ప్రభావం చూపించే అవకాశం ఉందని, వారి సామాజిక బంధాలు దెబ్బతినొచ్చని అభ్రిప్రాయపడ్డారు. 
 
ఓ అమెరికా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. ఉద్యోగుల మానసిక స్థితి ఎలా ఉండబోతోంది? వారి మానసికంగా అలసిపోతే ఎలా.. అనే ప్రశ్నలను లేవనెత్తారు. సామాజిక బంధాల ద్వారా మనం సాధించకున్న మంచినంతా ఇలా వర్క్ ఫ్రం హోం ద్వారా కోల్పోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. 
 
ఇంకా సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. శాశ్వతంగా ఇంటి నుంచి పని చేయడం వల్ల ఉద్యోగులకు కీడు జరుగుతుందన్నారు. ఏవైనా సమావేశాలకు సంబంధించి ఎదురుగా కలవడానికి, ఆన్‌లైన్‌లో కలవడానికి చాలా తేడా ఉంటుందని ఎత్తిచూపారు. అంతేకాకుండా వర్క్ ఫ్రం హోం వల్ల ఉద్యోగులు, సమాజంలో కలవలేని పరిస్థితులు కూడా వస్తాయని వివరించారు. 
 
ఈ క్రమంలో వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపి ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. దీనివలన కంపెనీల్లోని చాలా నియమ నిబంధనలు కూడా మార్చుకోవాల్సిన పరిస్థితులు వస్తాయని సత్య నాదెళ్ల స్పష్టం చేశారు.