ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలను తీసిన పాఠశాల బస్సు, నాన్నతో పాటు బండెక్కారు...
బెంగళూరులో దారుణం జరిగింది. ఇద్దరు చిన్నారుల పైకి పాఠశాల బస్సు దూసుకువచ్చి ప్రాణాలు తీసింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా కళ్లెదుటే తన కన్నబిడ్డలు బస్సు చక్రాల కింద నలిగి ప్రాణాలు విడిచారు. దుకాణంలో పాలు కొనుగోలు చేసేందుకు ఉదయాన్నే తన ద్విచక్రవాహనంపై బయలుదేరాడు ఆ తండ్రి. ఆయన బిడ్డలిద్దరూ తండ్రి వెళ్తున్న బైకుపై ఎక్కారు.
రోడ్డుపైకి వచ్చేసరికి ఎదురుగా మలుపులో స్కూలు బస్సు వస్తూ కనిపించింది. దీనితో ఆయన తన బైకును ఆపేసాడు. ఐతే బస్సు డ్రైవర్ మాత్రం నిర్లక్ష్యంగా నడుపుతూ వాహనం పైకి ఎక్కించేసాడు. దీనితో వాహనం కిందపడిపోవడంతో పాటు పిల్లలిద్దరూ బస్సు చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దుర్ఘటన సీసీ కెమేరాలో రికార్డయ్యింది.