ఆంధ్రప్రదేశ్-ఒడిశాల మధ్య కొటియా వివాదం.. ఏపీ సర్కారుకు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్-ఒడిశా ప్రభుత్వాల మధ్య కొటియా వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ కొనసాగింది. తమ భూభాగంలోని మూడు గ్రామ పంచాయతీల పేర్లు మార్చి ఏపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోందని గతంలో ఒడిశా ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ భూభాగంలోని మూడు గ్రామ పంచాయతీల పేర్లను మార్చి ఎన్నికలను నిర్వహిస్తోందని ఆరోపిస్తూ పిటిషన్‌లో పేర్కొంది.
ఒడిశా అభ్యంతరాలపై వచ్చే వారం లోపు సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఏపీ ప్రభుత్వం తరఫున విజయనగరం జిల్లా కలెక్టర్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. కోటియా పరిధిలోని 3 గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో భాగమేనని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం గతంలోనూ అక్కడ పంచాయతీ ఎన్నికలు నిర్వహించినట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
అరకు పార్లమెంట్ నియోజకవర్గం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి మూడు గ్రామాలు వస్తాయని స్పష్టం చేశారు. ఒడిశా పిటిషన్ కొట్టివేయాలని విజయనగరం కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సమాధానం ఇచ్చేందుకు ఒడిశా ప్రభుత్వం నాలుగువారాల గడువు కోరింది. దీంతో ఈకేసు తదుపరి విచారణను జస్టిస్ ఖన్ విల్కర్ ధర్మాసనం నాలుగు వారాలకు వాయిదా వేసింది.