సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 డిశెంబరు 2020 (12:46 IST)

రూ.500లు అప్పు.. తిరిగి ఇవ్వలేదని.. హత్య చేసేశాడు.. ఎక్కడ?

అప్పుగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించమని అడిగిన పాపానికి ఓ వ్యక్తిని మరో వ్యక్తి దారుణంగా హతమార్చాడు. తర్వాత దర్జాగా సొంతూరు వెళ్లిపోయాడు. నాలుగు రోజుల తర్వాత మృతదేహాన్ని స్థానికులు గుర్తించడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రానికి చెందిన సిభరామ్ దాస్, దుర్బధన్ ఉపాధి కోసం పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు వచ్చారు. 
 
ఓ తాపీ మేస్త్రి వద్ద ఇద్దరూ కూలిపనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిభరరామ్ దాస్ వద్ద.. దుర్బధన్ రూ.వెయ్యి అప్పుగా తీసుకున్నాడు. అందులో రూ.500 తిరిగిచ్చేశాడు. మరో రూ.500 ఇవ్వడంలో ఆలస్యం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. చిన్న గొడవ కాస్తా మాటామాటా పెరగడంతో ఘర్షణ జరిగింది. ఈ గొడవలో దుర్భధన్ సిభరామ్‌ను కొట్టి చంపేశాడు. 
 
ఆ గొడవలో దుర్బధన్.. సిభరామ్ ను కొట్టి చంపేశాడు. మృతదేహాన్ని వారు ఉంటున్న ఇంటివెనుక పొదల్లో పడేసి స్వగ్రామానికి పారిపోయాడు. నాలుగు రోజుల తర్వాత పొదల్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. 
 
మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించిన పోలీసులకు తొలుత హత్యకు గల కారణాలు తెలియలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు. దాదాపు వారం రోజుల పాటు వివిధ కోణాల్లో జరిగిన విచారణలో దుర్భధనే హత్య చేశాడని తెలిసింది. దీంతో నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.