శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 డిశెంబరు 2020 (10:59 IST)

వాట్సాప్ ద్వారా వీడియో కాల్ తీసి.. అలా చేస్తూ వేధించాడని..?

వాట్సాప్ ద్వారా వీడియో కాల్ తీసి అభ్యంతరకరంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆరోపిస్తూ ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియో కాల్‌లో అతను హస్త ప్రయోగం చేసినట్లు ఆరోపించింది. ఆ స్క్రీన్ షాట్స్‌ను పోలీసులకు అందజేసి అతనిపై కేసు నమోదు చేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనర్‌ కూడా అయిన ఆ నటి (32)కి శుక్రవారం (డిసెంబర్ 11) గుర్తు తెలియని నంబర్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. యూకె కోడ్‌తో ఉన్న ఆ కాల్‌ను రెండుసార్లు ఆమె లిఫ్ట్ చేయలేదు. మూడోసారి అలా లిఫ్ట్ చేసిందో లేదో అవతలి వ్యక్తి అసభ్యకర రీతిలో కనిపించాడు. అతను హస్త ప్రయోగం చేస్తున్నట్లు గమనించిన ఆ నటి వెంటనే స్క్రీన్ షాట్స్ తీసింది.
 
ఫోన్ కాల్ తర్వాత ఆ వ్యక్తి.. ఆమెను పేరుతో సంబోధిస్తూ మెసేజ్‌ కూడా చేశాడు. దీంతో ఆ నటి మెసేజ్‌ల ద్వారానే అతన్ని గట్టిగా నిలదీసింది. దీంతో అతను ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. తన వయసు 20 ఏళ్లు అని విదేశాల్లో చదువుకుంటున్నానని తెలిపాడు. తన స్నేహితురాలికి చేయబోయి పొరపాటున ఆమెకు ఫోన్ చేసినట్లు చెప్పాడు. అయితే అతని మాటలు నమ్మశక్యంగా లేకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.
 
ముంబైలోని వెర్సోవా పోలీసులు ఆ నటి ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేశారు. సెక్షన్ 354 ఏ,సెక్షన్ 509 ఏ,ఐటీ యాక్ట్ 67ఏ కింద అభియోగాలు మోపారు. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.