శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 డిశెంబరు 2020 (15:38 IST)

అక్రమ సంబంధం ఉన్న యువతిని లేపుకెళ్లిన యువకుడు.. పట్టుకుని చంపేశారు...

హైదరాబాద్ నగరంలో మరో వివాహేతర హత్య జరిగింది. ఓ యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు ఓ యువకుడుని పట్టుకుని బంధించారు.  ఆ తర్వాత చిత్రహింసలు పెట్టి హతమార్చి, మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ హత్య కేసు వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన శ్రీకాంత్‌ రెడ్డి అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. శ్రీకాంత్‌ రెడ్డిని చంపి కనకరాజ్ అనే వ్యాపారి శ్మశానవాటికలో పూడ్చిపెట్టాడు. 
 
నిందితుడు కనకరాజ్‌ను రాచకొండ ఎస్వోటీ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. స్మశాన వాటికలోనే శ్రీకాంత్‌ రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. కనకరాజ్‌తో వివాహేతర సంబంధమున్న యువతిని శ్రీకాంత్‌ రెడ్డి తీసుకు వెళ్లడంతో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో ఇద్దరిని తీసుకొచ్చిన కనకరాజ్.. జవహర్‌నగర్‌లోని ఓ ఇంట్లో బంధించాడు. 10 రోజుల పాటు శ్రీకాంత్‌రెడ్డిని హింసించి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.