బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 డిశెంబరు 2020 (16:41 IST)

మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే..

మహిళల ఆరోగ్యంగా వుండాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే.. అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ముందుగా అన్నం మొదటి ముద్దలో నువ్వుల పొడి ఒక చెమ్చా కలుపుకుని తినడంవల్ల హార్మోను బ్యాలెన్సింగ్‌గా ఉంటాయి. రాత్రి పడుకునే ముందు అర గ్లాసు వేడి పాల్లలో ఒక చెమ్చా పటిక బెల్లం చూర్ణం కలుపుకొని తాగడం మంచిది.
 
ఇక మెంతికూరను వారానికి రెండు సార్లైనా క్రమం తప్పకుండా తింటే నెలసరి సమస్యలుండవు. నిమ్మరసం తాగడం అలవాటు చేసుకోవాలి. తులసి ఆకులు లేదా తులసి టీని సేవించడం ద్వారా రొమ్ము క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు. ఆకుకూరలు, కూరగాయలను అధికంగా తీసుకుని రైస్‌ను తగ్గించాలి.

పుదినా ఆకులను ఎండబెట్టి, పొడి చేసుకొని, రెండు గ్లాసుల నీటిలో బాగా మరిగించి, చల్లారాక వడకట్టి తాగితే బహిష్టు నొప్పి తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.