సంబంధిత వార్తలు
- ఆన్ లైన్ రమ్మీపై నిషేధం, ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
- సుశాంత్ కేసు : రియా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు... మరో కేసు, ఏక్షణమైనా అరెస్టు
- కోమాలో ఉత్తర కొరియా చీఫ్ కిమ్.. అధ్యక్ష బాధ్యతలు ఆమెకేనా?
- సాగునీటి రంగంలో అంతులేని అన్యాయం జరిగింది, ఆంధ్రప్రదేశ్‌ది అర్థంపర్థం లేని రాద్దాంతం: కేసీఆర్
- 12 మందిని సబ్ కలెక్టర్లుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
కరోనా విషయంలో ఏపీ ప్రభుత్వం చేతులెత్తేసింది: చంద్రబాబు
కరోనా వైరస్ విషయంలో ఏపీ ప్రభుత్వం చేతులెత్తేసిందని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కరోనా బాధిత కుటుంబాలు, కరోనా విజేతలు, వైద్య నిపుణులతో ఈ రోజు చంద్రబాబు వీడియో కాన్పెరెన్స్ నిర్వహించారు. ఇందులో చంద్రబాబు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
కరోనా బాధితులకు ఆస్పత్రిలో కనీసం పడకలు లేని పరిస్థితి నెలకొని ఉందని అన్నారు. ఇక వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి వెళితే రూ.5 లక్షల నుంచి 20 లక్షల వరకు వసూలు చేస్తున్నారని అన్నారు. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ క్షీణించి పోయిందని తెలిపారు.
కరోనా వలన ఆర్థికంగా నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. చేతి వృత్తులు, కుల వృత్తుల వారికి ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. ఇక ఏపీలో కరోనా మహమ్మారి అంతకంతకు పెరిగిపోతున్నది. రాష్ట్రంలో కొత్తగా 10,392 కేసులు నమోదు కాగా మొత్తం 60,804 శాంపిల్స్‌ను పరీక్షించారు.
ఇక మరో 8,454 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ కారణంగా రాష్ట్రంలో కొత్తగా 72 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం 4,55,531 కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,30,076 యాక్టివ్ కేసులున్నాయి.
