12 మందిని సబ్ కలెక్టర్లుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
2018 బ్యాచ్‌కు చెందిన ప్రొబేషనర్ ఐఏఎస్‌లను సబ్ కలెక్టర్లుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 12 మందిని సబ్ కలెక్టర్లుగా నియమించింది. సబ్ కలెక్టర్లగా నియమితులైన వారి వివరాలు ఇలా వున్నాయి.
1. పృధ్వీ తేజ్ ఇమ్మడి- సబ్ కలెక్టర్(కడప)
2. ప్రతిష్ఠ మాంగైన్- సబ్ కలెక్టర్ నూజివీడు(కృష్ణ)
3. హిమాన్షూ కౌసిక్- సబ్ కలెక్టర్ అమలాపురం(తూర్పుగోదావరి)
4. అమిలినేని భార్గవ్ తేజ- సబ్ కలెక్టర్ కందుకూరు(ప్రకాశం)
5. విధే ఖారే- సబ్ కలెక్టర్ పార్వతీపురం(విజయనగరం),(పార్వతిపురం ఐటిడిఎ పిఓగా అదనపు బాధ్యతలు)
6. నారపు రెడ్డి మౌర్య- సబ్ కలెక్టర్ నర్సీపట్నం(విశాఖపట్నం)
7. శ్రీవాస్ అజయ్ కుమార్- సబ్ కలెక్టర్ నరసరావు పేట(గుంటూరు)
8. అనుపమ అంజలి- సబ్ కలెక్టర్ రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి)
9. సూరజ్ ధనంజయ్- సబ్ కలెక్టర్ టెక్కలి(శ్రీకాకుళం)
10. మేదిడ జాహ్నవి- సబ్ కలెక్టర్ మదనపల్లి(చిత్తూరు)
11. కల్పనా కుమారి- సబ్ కలెక్టర్ నంద్యాల(కర్నూలు)
12. కేతన గార్గ్- సబ్ కలెక్టర్ రాజంపేట(కడప)
ప్రస్తుతం రాజంపేట, నరసరావుపేట, కందుకూరు, నూజివీడు, నంద్యాల, టెక్కలి, నర్సీపట్నంలో కొనసాగుతున్న డిప్యూటీ కలెక్టర్లను జీఏడీకి రిపోర్టు చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.