శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 జనవరి 2020 (18:30 IST)

తప్పు చేశాం.. క్షమించండి.. రైతుల కాళ్లుపట్టుకున్న పోలీసులు

అమరావతిలో రైతుల ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. శనివారం కూడా రైతుల ఆందోళనలు జరిగాయి. శుక్రవారం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మహిళల పట్ల, రైతులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దౌర్జన్యంగా వ్యవహరించారు. పోలీసుల వైఖరిని రైతులు తీవ్రంగా ఖండిస్తున్నారు. రైతుల బంద్ సందర్భంగా శనివారం పోలీసులకు రైతులకు మద్య వాగ్వాదం రిగింది
 
పోలీసులకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించరాదని రైతులు నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తమకు సకరించాలని పోలీసులు కోరారు. కొందరు పోలీసులు ఆందోళనలు చేస్తున్న రైతుల కాళ్లు పట్టుకున్నారు. శుక్రవారం మహిళల పట్ల ప్రవర్తించిన అనుచిత తీరుకు క్షమాపణలు చెప్పారు. కాళ్లు పట్టుకొని తమను క్షమించాలని కోరారు. 
 
శుక్రవారం సకల జన సమ్మెలో భాగంగా మందడంలో ఆందోళనకు దిగిన మహిళల పట్ల పోలీసులు విచక్షణా రహితంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలను బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించారు.