శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 అక్టోబరు 2019 (10:35 IST)

గదిలోకి పిలిచి అత్యాచారం చేశాడు... ఆపై వీడియో తీసి బెదిరిస్తున్నాడు... నన్ ఆరోపణ

కేరళ రాష్ట్రంలో మరో ఆర్చి బిషప్‌పై ఓ నన్ సంచలన ఆరోపణలు చేశారు. గదిలోకి పిలిచి అత్యాచారం చేయడమే కాకుండా, వీడియో తీసి నిత్యం బెదిరిస్తున్నాడంటూ కేంద్ర, రాష్ట్ర జాతీయ మహిళా సంఘంతో పాటు.. జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. 
 
కొట్టాయంకు చెందిన చర్చి బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ తనపై అత్యాచారం చేశాడంటూ ఓ నన్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఇది స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. 
 
అత్యాచారానికి పాల్పడటమేకాకుండా ఆ సందర్భంగా రహస్యంగా తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ తన పరువును తీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదును మానవ హక్కుల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఆమె ఆరోపణలపై విచారణకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.