సంబంధిత వార్తలు
- భారతదేశంలో డిజిట్ కెరీర్ కౌన్సిలింగ్ను విప్లవాత్మక మార్పులను తీసుకువస్తున్న ప్రోటీన్
- నోకియా సీ30 స్మార్ట్ఫోన్ రిలీజ్.. ధరెంతో తెలుసా? రూ.10,999
- కుప్పకూలిన భారత వాయుసేన జెట్ ఫైటర్ విమానం
- 100 కోట్ల టీకాలు - ఈ ఘనత ప్రతి ఒక్క భారతీయుడి ఘనత : ప్రధాని మోడీ
- దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ : 100 కోట్ల చేరువలో...
దేశంలో కొత్తగా మరో 15 వేల పాజిటివ్ కేసులు
దేశంలో కొత్తగా మరో 15,786 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఈ వైరస్ సోకిన వారిలో 231 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 1,75,745 మంది చికిత్స తీసుకుంటున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది.
కాగా, ఇప్పటివరకు 3,35,14,449 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం మృతుల సంఖ్య 4,53,042కు చేరుకుంది. నిన్న దేశ వ్యాప్తంగా 13,24,263 కరోనా పరీక్షలు చేశారు. దీంతో ఇప్పటివరకు పరీక్షించిన మొత్తం శాంపిళ్ల సంఖ్య 59,70,66,481కు చేరింది.
