1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. India enters 100-crore vaccine club to fight Covid, PM Modi says nation scripts history

దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ : 100 కోట్ల చేరువలో...

India
కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో దూసుకుపోతోంది. రికార్డు స్థాయిలో డోసులు వేసిన ఘనత సాధించింది. కరోనా వైరస్ బారినపడుకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేచియంచుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి. అందుకు తగిన చర్యలను కూడా చేపడుతున్నాయి. 
 
ఈ క్రమంలో దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్‌‌లో డోసుల సంఖ్య గురువారానికి 100 కోట్లు దాటనుంది. భారత్ సాధించిన ఈ ఘనతను అంతటా చాటి చెప్పేందుకు కేంద్రం రెడీ అవుతోంది. అన్ని రైళ్లలో, మెట్రో రైళ్లలో, విమానాల్లో, షిప్స్‌ల్లో 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ విజయాన్ని లౌడ్‌ స్పీకర్ల ద్వారా ప్రకటించనున్నారు. 
 
అలాగే ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఇక వ్యాక్సినేషన్‌ 100 కోట్ల డోసులకు చేరిన సందర్భంగా.. సింగర్‌‌ కైలాశ్‌ ఖేర్‌ ఆలపించిన పాటను, ఒక ఆడియో.. విజువల్‌ ఫిల్మ్‌ను కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ విడుదల చేయనున్నారు. బుధవారం సాయంత్రం నాటికి మన దేశంలో 99.54 కోట్ల డోసులతో వ్యాక్సినేషన్‌ పూర్తయింది. 
 
ఇక విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు సంబంధించిన కొవిడ్‌ మార్గదర్శకాలను భారత్‌ తాజాగా సవరించింది. భారత్‌తో పరస్పర టీకా ఆమోద ఒప్పందాన్ని కుదుర్చుకున్న దేశాలకు ఈ విషయంలో పలు సడలింపులు కల్పించింది. ఈ సడలింపు ఇచ్చిన జాబితాలోని 11 దేశాలు ఉన్నాయి. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
పట్టాభినే కాదు.. చంద్రబాబును కూడా అరెస్టు చేయాలి