ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎంజీ
Last Modified: బుధవారం, 20 అక్టోబరు 2021 (23:14 IST)

India Corona: అదుపులోనే మహమ్మారి.. కానీ పెరిగిన మృతుల సంఖ్య

దేశంలో కరోనా మహమ్మారి అదుపులోనే ఉంది. అయితే కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ముందురోజు 13 వేలకు పడిపోయిన కేసులు.. తాజాగా 14,623కి చేరాయి. మరణాల సంఖ్యలో కూడా పెరుగుదల కనిపించింది. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెలువరించింది.

 
మంగళవారం 13,23,702 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 14,623 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. నిన్న 19,446 మంది కోలుకున్నారు. 197 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పటి వరకూ కరోనా సోకిన వారి సంఖ్య 3.41 కోట్లకు చేరింది. అందులో 3.34 కోట్ల మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. ఇప్పటివరకు 4,52,651 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 1,78,098కి తగ్గింది. క్రియాశీల రేటు 0.52 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 98.15 శాతానికి చేరింది.

 
దేశంలో కరోనా టీకా కార్యక్రమం కీలక ఘట్టానికి చేరుకోనుంది. 100 కోట్ల డోసుల లక్ష్యం వైపు సాగుతోంది. ఇప్పటివరకు 99.12 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న 41.36 లక్షల మంది టీకా వేయించుకున్నారు.