గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 16 అక్టోబరు 2021 (20:13 IST)

ట్యూషన్‌ సెంటర్‌లో ఎనిమిది మంది విద్యార్థులకు కోవిడ్‌

కరోనావైరస్ ఓ పట్టాన వదిలేట్లు లేదు. పోయినట్లే పోయి మళ్లీ పట్టుకుంటుంది. తాజాగా ట్యూషన్‌ సెంటర్‌లో ఎనిమిది మంది విద్యార్థులకు కోవిడ్‌ సోకడంతో అంతా అలెర్ట్ అయ్యారు. గుజరాత్‌లోని సూరత్‌ నగరంలో ట్యూషన్‌ సెంటర్‌ క్లాసులకు రెగ్యులర్‌గా వెళ్లే విద్యార్థి ఒకరికి ఈనెల 7న కరోనా వైరస్ పట్టుకుంది.
 
దాంతో ఆ ట్యూషనుకి వచ్చే మరో 125 మంది విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు చేసారు. ఈ పరీక్షల్లో ఏడుగురికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. దీనితో ట్యూషన్ను తాత్కాలికంగా మూసివేసారు. మరోవైపు సూరత్ నగరంలో ఇలా విద్యార్థులకు కరోనా సోకడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపేందుకు భయపడుతున్నారు.