బుధవారం, 11 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 అక్టోబరు 2021 (18:27 IST)

మాకు చదువులొద్దు.. క్రీడల కోసం వెళ్ళిపోతున్నాం.. ఏడుగురు విద్యార్థులు అదృశ్యం!

కర్ణాకటలో ఏడుగురు విద్యార్థులు అదృశ్యమైన ఘటన సంచలనం రేపింది. బెంగళూరులో ఏడుగురు విద్యార్థులు తమకు చదవడం ఇష్టం లేదని, ఆటలే కావాలని ఏకంగా ఇంటి నుంచే పారిపోయారు. బెంగళూరు బాగలగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
ఉదయం పాఠశాలకు వెళ్తున్నామని వెళ్లిన విద్యార్థులు మళ్లీ ఇంటికి తిరిగిరాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే వారి ఇంటిలో ఓ లేఖ లభించింది. అందులో ‘మాకు చదువులంటే ఇష్టం లేదు. ఆటలంటేనే ప్రేమ అని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఎంత ఒత్తిడి తెచ్చినా చదవాలని ఆసక్తి వారికి కలుగడం లేదని స్పష్టం చేశారు. 
 
అందుకే క్రీడలే తమ కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. మంచి పేరు, హోదా, డబ్బులు సంపాదించిన తర్వాత తిరిగి వస్తామని తెలిపారు. అంతేకాదు, వాళ్ల కోసం ఆందోళన చెందవద్దని, ఎక్కడా వెతకవద్దని సూచించారు.