1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Corona Virus, Trump says will be tested for coronavirus daily

ఏం చేసేదీ రోజూ కరోనా పరీక్ష చేయించుకుంటున్నా: డొనాల్డ్ ట్రంప్

Corona Virus
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కేసులు 40 లక్షలు దాటిపోయాయి. అమెరికాలో ఏకంగా 13 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 78 వేల మంది మృత్యువాత పడ్డారు. లక్షా 83 వేల మంది కోలుకున్నారు.
 
ఈ క్రమంలో ఇప్పుడు కరోనా వైరస్ భయం ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా పట్టుకుంది. దీనికి కారణం అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ సహాయకుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. అంతకుముందు రోజు వైట్‌హౌస్‌ సిబ్బందిలో కూడా మరొకరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో డోనాల్డ్ ట్రంప్ కార్యాలయం అప్రమత్తమైంది. 
 
అమెరికా అధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రెస్ సెక్రటరీ కేటీ మిలర్‌కు కరోనా ఉన్నట్టు శుక్రవారం జరిగిన పరీక్షల్లో తేలడంతో ఇకపై ప్రతిరోజూ మైక్ పెన్స్, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు టెస్టులు చేయాలని భద్రతా అధికారులు నిర్ణయించారు.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
365 రోజులకు రోజూ 2జీబీ డేటా.. జియో ''వర్క్ ఫ్రమ్ హోమ్'' ప్లాన్