శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 మే 2020 (18:11 IST)

అల్లంతో కరోనా రాదట.. అల్లం రసంలో పాలను కలిపి తీసుకుంటే? (video)

Ginger
కరోనా వైరస్‌ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే... వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. ముందుగా అల్లాన్ని ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అల్లం రసంలో పాలలో కలుపుకుని తీసుకోవడం ద్వారా ఉదర సంబంధిత రుగ్మతల నుంచి ఉపశమనం పొందవచ్చు.
 
మలబద్ధకం, ఛాతిలో నొప్పి, నీరసం తగ్గాలంటే.. అల్లం పచ్చడిని రోజూ ఒక స్పూన్ అయినా తీసుకోవాలి. పంటి నొప్పితో ఇబ్బంది పడేవారు.. అల్లం ముక్కతో మసాజ్ చేయడం ద్వారా మంచి ఫలితం వుంటుంది. లేదంటే అల్లంను దంచి నీటిలో వేసి మరిగించాలి. ఆ నీటితో నోటిని పుక్కిలించాలి. 
 
అలాగే ఉదయం లేచిన వెంటనే ఒక స్పూన్ అల్లం రసాన్ని తీసుకుంటే.. రక్తంలోని చక్కెర స్థాయిలను తొలగించుకోవచ్చు. అల్లం రసం, నిమ్మరసం, ఉల్లి రసం కలిపి ఉదయం పూట ఒక స్పూన్ మేర తీసుకుంటే.. ఆస్తమా, దగ్గు నయం అవుతుంది. 
 
తలనొప్పిని తగ్గించుకోవాలంటే.. అల్లం రసంలో కాసింత నిమ్మరసం చేర్చి తేనెతో కలిపి తీసుకోవడం జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. అల్లం నానబెట్టిన నీటిని సేవించడం ద్వారా వాత సంబంధిత రోగాలు నయం అవుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.