శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 మే 2020 (12:28 IST)

ఆంధ్రాలో కరోనా జోరు : కొత్తగా 60 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో మరో 60 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మొత్తం 7782 శాంపిల్స్‌ను పరీక్షించగా, అందులో 60 పాజిటివ్ కేసులుగా తేలింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆరోగ్యాంధ్ర ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. 
 
ఈ కొత్త కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1777కు పెరిగాయి. ఇందులో 729 మంది డిశ్చార్జ్ గాకా, మరో 1012 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు అలాగే, 36 మంది చనిపోయారు. కరోనా కేసులు అధికంగా ఉన్న జిల్లాల్లో కర్నూలు, ఆ తర్వాత గుంటూరు, కృష్ణా ఉన్నాయి.
 
ఇకపోతే జిల్లా వారీగా మొత్తం కేసుల సంఖ్యను పరిశీలిస్తే, అనంతపురం 80, చిత్తూరు 82, ఈస్ట్ గోదావరి 46, గుంటూరు 363, కడప 90, కృష్ణ 300, కర్నూలు 533, నెల్లూరు 92, ప్రకాశం 61, శ్రీకాకుళం 5, విశాఖపట్టణం 39, వెస్ట్ గోదావరి 59 చొప్పున నమోదు కాగా, గుజరాత్‌, కర్నాటక రాష్ట్రాలకు చెందిన 28 మంది వలస కూలీలకు ఈ వైరస్ సోకింది.