శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 5 మే 2020 (23:27 IST)

భూముల రిజిస్ట్రేషన్లో ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చిందో తెలిస్తే షాకే..?

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి రిజిస్ట్రేషన్ సేవలను తీసుకొచ్చింది ప్రభుత్వం. గ్రీన్ జోన్లలో 108 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. లాక్ డౌన్ తరువాత తొలిరోజు రిజిస్ట్రేషన్ ఫీజు రూపంలో ప్రభుత్వానికి అనూహ్యంగా కోటి రూపాయల ఆదాయం వచ్చిందట.
 
మొత్తం 633 డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్లు చేశారట. లాక్ డౌన్ నేపథ్యంలో మార్చి 23వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఆంక్షల సడలింపులతో కంటోన్మెంట్ జోన్ల వెలుపల ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
 
కరోనా వైరస్ నివారణ కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫీసుల్లో అందుబాటులో సాధారణ సేవలు తీసుకువచ్చారు. కరోనా నియంత్రణలో భాగంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భౌతిక దూరం ఆంక్షలు తప్పనిసరి చేశారు. అలాగే మాస్కులు ధరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
 
ముందు వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన అవసరమైతే టోకెన్లు జారీ చేసేస్తున్నారు. పబ్లిక్ డేటా ఎంట్రీ దస్తావేజులకు తొలి ప్రాదాన్యం ఇస్తున్నారు. బయోమెట్రిక్ యంత్రాలను వినియోగించి ప్రతిసారి శానిటైజ్ చేస్తున్నారు సిబ్బంది. అలాగే వేలిముద్రలు, స్టాంపు పేపర్లు తీసుకునేటప్పుడు ఆ తరువాత కూడా చేతులు శానిటైజేషన్ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.