సంబంధిత వార్తలు
- దేశంలో ఆ సంఖ్య తగ్గింది.. మహారాష్ట్రలో 15,842మంది మృతి
- కరోనా చికిత్సకు భారీ బిల్లుల బాదుడు, ఆసుపత్రి లైసెన్స్ క్యాన్సిల్ చేసిన కేసీఆర్ సర్కార్
- హైదరాబాద్‌లో దారుణం, కరోనా నెగిటివ్ వచ్చినా పాజిటివ్ అంటూ లక్షలు వసూలు
- "ఆత్మ" బంధువులు, కరోనాతో మరణిస్తే ఒక్క రూపాయి తీసుకోకుండా అంత్యక్రియలు, ఎక్కడ?
- దేశంలో మరో 52 వేల పాజిటివ్ కేసులు - 18 లక్షలు క్రాస్
కరోనావైరస్ పాల ప్యాకెట్ల ద్వారా వస్తుందా?
ఇపుడు కరోనావైరస్ ఏ వస్తువు ద్వారా వస్తుందోనన్న భయం చాలామందిలో వుంది. కూరగాయలు తెచ్చుకుని వాటిని పసుపు, ఉప్పు కలిపిన నీళ్లలో వేసి కొందరు కడుతున్నారు. మరికొందరు శానిటైజర్లతో కడిగే ప్రయత్నం చేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అన్నింటికీ మించి పాల ప్యాకెట్లతో కరోనావైరస్ వస్తుందోమోనన్న భయంతో చాలామంది వాటిని శానిటైజర్ కలిపిన నీళ్లలో వేసి కడిగి తీసుకుంటున్నారు. ఐతే పాల ప్యాకెట్లను ఇలా శానిటైజర్‌తో కడగడం ఆరోగ్యానికి ప్రమాదం.
మరేం చేయాలి? అంటే... పాల ప్యాకెట్లను తీసుకున్న తర్వాత మీ చేతులను సబ్బుతో బాగా శుభ్రంగా కడగండి. ఆ తర్వాత పాల ప్యాకెట్‌ను నీటిలో కడగండి. ప్యాకెట్లను శానిటైజర్లతో కాని డిటర్జెంట్‌తో కాని కడగాల్సిన పనిలేదు. కడిన తర్వాత ఆ నీళ్లు పాల పాత్రలోకి రాకుండా ఉండటానికి ప్యాకెట్‌ను కాసేపు పక్కన పెట్టేయండి. ఈ పాల ప్యాకెట్ పైన వున్న నీళ్లను తుడిచేందుకు ఇంట్లోని కిచెన్ టవల్‌ను ఉపయోగించవద్దు.
కొద్దిగా నీళ్లు ప్యాకెట్ పై నుంచి పోయాక మళ్లీ మీ చేతులను కడుక్కొని ప్యాకెట్‌ను జాగ్రత్తగా కత్తిరించి పాత్రలో పోసి పాలను వేడి చేయండి. అంతే పాలు సురక్షితంగా మీకు చేరినట్లే. ఐతే పాల ప్యాకెట్లు వేసేవారు మాస్కులు కట్టుకుంటున్నారో లేదో చూడండి. ఒకవేళ వారు ధరించనట్లయితే వాటిని ధరించాలని చెప్పండి. అలాగే ప్యాకెట్ తీసుకునే సమయంలో భౌతిక దూరం పాటించండి.
తర్వాతి కథనం
