1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Italian Olympic 800m finalist Donato Sabia dies of coronavirus

కరోనాతో ఇటలీ మాజీ అథ్లెట్ డొనాటో సాబియా మృతి

Italian Olympic finalist
కరోనా వైరస్‌ కారణంగా ఇటలీకి చెందిన మాజీ అథ్లెట్ డొనాటో సాబియా(56) మృతి చెందాడు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 14 లక్షలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా, మృతుల సంఖ్య 83వేలకు పైగా ఉంది. 
 
800 మీటర్ల రేస్‌లో రెండు సార్లు ఒలింపిక్ ఫైనల్స్‌కు చేరిన డొనాటో కోవిడ్‌-19 కారణంగా బుధవారం కన్నుమూసినట్లు ఇటాలియన్ ఒలింపిక్ కమిటీ (సీవోఎన్ఐ) ప్రకటించింది. కరోనా కారణంగా గత కొన్ని రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్న డొనాటో.. పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. 
 
1984 లాస్ఎంజెల్స్ ఒలింపిక్స్ 800 మీటర్ల విభాగంలో ఐదో స్థానంలో నిలిచిన సాబియా.. 1988 సియోల్ ఒలింపిక్స్‌లో ఏడో స్థానం దక్కించుకున్నాడు. యూరోపియన్ ఇండోర్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన డొనాటో మృతి పట్ల సీవోఎన్ఐ సంతాపం తెలిపింది. 
 
మరోవైపు ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రస్తుత, మాజీ ఆటగాళ్లకు ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అండగా నిలిచింది. సాయం కోసం ఎదురుచూస్తున్న తమ సభ్యులకు అత్యవసర సహాయ నిధి ఏర్పాటు చేసింది. ఉపాధి కోల్పోయి ఆందోళన, ఒత్తిడిలో చిక్కుకున్న ఆటగాళ్లకు తాత్కాలిక సాయం కింద 2.5 లక్షల డాలర్ల నిధిని ఏర్పాటు చేశామని ఏసీఏ జనరల్ మేనేజర్ కెల్లీ యాపిల్‌బీ పేర్కొన్నారు.
About Writer
సెల్వి