1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Railway coaches to be turned into isolation wards

రైల్వే భోగీలే ఐసోలేషన్ వార్డులు.. 3లక్షల బెడ్స్ సిద్ధం.. ఏం తెలివి?

Railway
isolation wards
రైల్వే భోగీలే ఐసోలేషన్ వార్డులుగా ఏర్పాట్లు చేస్తోంది. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగిపోయిన రైళ్ల బోగీలను ఐసోలేషన్ వార్డులు, ఐసీయులుగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 
 
ఇందుకు సంబంధించిన ప్రోటో టైప్ కోచ్‌లను రైల్వే శాఖ సిద్ధం చేసింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే సరైన వైద్య సదుపాయాలు లేని గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు కూడా వైద్యసదుపాయలను అందించే అవకాశాలు ఉంటాయి. 
 
ఈ కోచ్‌లో టాయిలెట్లు కూడా ఉన్నందున ఐసోలేషన్ వార్డులుగా కూడా ఉపయోగించవచ్చని రైల్వే అధికారులు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా రైల్వే శాఖ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినట్టు సమాచారం.
 
అంతే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న 13వేలపైగా రైళ్లు నడిచే భారత్‌లో.. రైళ్లను ఆస్పత్రులుగా మార్చడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని నిపుణులు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా చేయడం వల్ల మొత్తం మూడు లక్షల బెడ్స్ అందుబాటులోకి రానున్నాయి.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
జీహెచ్ఎంసీ పరిధిలో రెండో జోన్లు లేవు.. దుష్ప్రచారం చేస్తే జైలుశిక్షే..