సంబంధిత వార్తలు
- పేదలకు ఒక్క చపాతీ అయినా ఇవ్వండి.. రష్మీ గౌతమ్
- కరోనా వైరస్‌ను తొక్కేస్తున్న సీఎం జగన్... ఆంధ్రలో అడుగుపెట్టిన వైరస్ అక్కడే మలమల మాడి చస్తుందంతే...
- కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అల్లు అర్జున్ విరాళం.. మొత్తం రూ.1.25 కోట్లు
- కరోనా వైరస్.. పెరిగిపోతున్న వాట్సాప్ వాడకం..
- ఆ రుణాలకు మాత్రమే మారటోరియం : క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించాల్సిందే : ఆర్బీఐ
సచిన్ భారీ విరాళం.. ఇటలీలో 8,165కి చేరిన కరోనా మృతుల సంఖ్య
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కరోనా మహమ్మారిపై పోరాటానికి తన వంతు విరాళం ప్రకటించాడు. దేశంలోని ప్రముఖులు సామాజిక బాధ్యతతో స్పందిస్తూ భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి సహాయనిధికి రూ.25లక్షలు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు విరాళంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు.
భారత్‌లో కరోనా కేసుల పెరుగుదల నిష్పత్తి ఆందోళనకరంగా ఏమీ లేకున్నా.. వైరస్ వ్యాప్తిని దృష్టిలో వుంచుకుని మున్ముందు కూడా కఠినంగా వ్యవహరించాలని కేంద్రం భావిస్తోంది.
ఇదిలా ఉంటే కరోనా మృత్యుఘోషతో ఇటలీ అట్టుడికిపోతోంది. ఇప్పటికే వేలసంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడి మృత్యు ఒడిలోకి చేరిపోతున్నారు. దీనిని అరికట్టేందుకు, ఆ మహమ్మారి బారి నుంచి తమ ప్రజలను కాపాడుకునేందుకు ఇటలీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేవీ తగిన ఫలితాలనివ్వడం లేదు.
గత 24 గంటల్లోనే 662 మంది కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని కన్నుమూశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరితో కలుపుకొని ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 8,165కు చేరింది.
