1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Take F1 route to accelerate vaccine: CEPI CEO Dr Richard Hatchett

కరోనాతో ఇంకా ఇబ్బందులు.. కొత్త వ్యాధుల ముప్పు.. రిచర్డ్ హాచెట్

corona visus
కరోనా ఇంకా పోలేదని.. కొత్త వ్యాధుల ముప్పు పొంచి వుందని కొలిషన్‌ ఫర్‌ ఎపిడెమిక్‌ ప్రిపేర్డ్‌నెస్‌ ఇన్నోవేషన్స్‌(సెపీ-యూకే) సీఈవో డాక్టర్‌ రిచర్డ్‌ హాచెట్‌ హెచ్చరించారు. కరోనా తగ్గుముఖం పడటంతో కొన్నాళ్ల పాటు ప్రపంచ దేశాలు ఉపశమనం పొందాయి. 
 
ఇలాంటి పరిస్థితుల్లో హాచెట్ హెచ్చరిక ప్రజల్లో భయాందోళనకు కారణమైంది. కరోనాలో ఎప్పటికప్పుడూ మార్పులు చోటుచేసుకుంటున్నాయనే విషయాన్ని గుర్తు చేశారు. జన్యు పరిణామ క్రమంలో ఒక్కోసారి వైరస్‌ విరుచుకుపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కొవిడే కాకుండా మరెన్నో కొత్త వ్యాధులు పొంచి ఉన్నాయని.. వాటి విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.
 
దక్షిణ అమెరికాలోని పరాగ్వేలో గన్యా ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. ఉగాండాను ఎబోలా వైరస్‌ కుదిపేస్తోంది. ఏ వ్యాధి లేదా వైరస్‌ ఎక్కడి నుంచి, ఎప్పుడు ఉద్భవిస్తుందో అంచనా వేయలేమని రిచర్డ్ హాచెట్ తెలిపారు. కొత్త కొత్త ఉపద్రవాలకు మనం సిద్ధపడాల్సిందేనని తెలిపారు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
డొనాల్డ్ ట్రంప్‌ను చంపేస్తాం.. ప్రతీకారం తీర్చుకుంటాం.. ఇరాన్