గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (20:34 IST)

నటీమణుల జీవితం ఇంత కష్టంగా వుంటుందా? ఆత్రేయ

సోషల్ మీడియాకు సెలెబ్రిటీలు దూరంగా వుండాలని దర్శకుడు వివేక్ ఆత్రేయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కోవిడ్ సమయంలో  తాను ఎదుర్కొన్న సమస్యను ఈ ఇంటర్వ్యూలో తెలిపారు. కోవిడ్ సమయంలో తన స్నేహితుడి తండ్రి అనారోగ్యానికి గురయ్యారని.. బ్లడ్ అవసరమైతే ఆయన బ్లడ్ గ్రూపునకు సరిపడే డొనేటర్ కోసం చాలా వెతికామని.. ఈ క్రమంలో తన ఫోన్ నెంబర్ జత చేస్తూ డోనర్ కోసం సెర్చ్ చేశామన్నారు. 
 
ఈ విషయం తెలిసి స్వీటీ అనుష్క.. తమకు సాయం చేయడం కోసం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ పోస్టులో వున్న ఫోన్ నెంబర్ ఆమెదే అనుకుని..  చాలామంది ఆమెకు కాల్స్ చేసి ఇబ్బంది పెట్టారని చెప్పుకొచ్చారు. చాలామంది వీడియో కాల్స్ చేశారు. 
 
ఒకడైతే షర్టు లేకుండా ఫోటోలు పంపారు. ఆ దారుణాలు చెప్పలేను. నటీమణుల జీవితం ఇంత కష్టంగా వుంటుందా అని ఆ రోజు షాకయ్యానని తెలిపారు. కొంత కాలానికే ఆ ఫోన్ నెంబర్‌ను బ్లాక్ చేసేశానని వివేక్ వివరించారు. అంటే సుందరానికి సినిమా ఫలితానికి తనదే బాధ్యత అని చెప్పారు. ఈ సినిమా నిడివి ఎక్కువైందని.. దాన్ని ఎడిట్ చేసేందకు వీలు పడలేదని ఆత్రేయ వెల్లడించారు.