సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (18:53 IST)

అక్కినేని ఫ్యామిలీకి దగ్గరగా వున్న సమంత?

Samantha, Dev Mohan
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యం బారిన పడిన పడటంతో అఖిల్ అక్కినేని సమంత అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తాజాగా హీరోగా సుమంత్ కూడా తన ఆరోగ్యంపై స్పందించారు. 
 
ఇటీవల సమంత నటిస్తున్న లేటెస్ట్ చిత్రం శాకుంతలం.. ఈ సినిమా టీజర్ విడుదలవగా ఆ టీజర్‌పై హీరో సుమంత్ ప్రశంసలు కురిపించారు. వీటిన్నంటినీ చూస్తుంటే సమంత అక్కినేని ఫ్యామిలీకి దగ్గరగా వున్నట్లు తెలుస్తోంది. 
 
తను నాగచైతన్య నుంచి విడిపోయినప్పటికీ ఆ ఇంటి కుటుంబ సభ్యులతో మాత్రం తరచూ మాట్లాడుతుంటుందని వారితో సన్నిహితంగానే మెలుగుతుందని గట్టిగానే వినిపిస్తోంది. సమంత గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శాకుంతలం.. ఈ సినిమా ఫిబ్రవరి 19న విడుదల కానుంది.