గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 ఫిబ్రవరి 2023 (19:03 IST)

పసుపు రంగు దుస్తుల్లో మెరిసిపోయిన సమంత.. ఫోటో షూట్ అదుర్స్

samantha
సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నాని ఇటీవల సినీనటి సమంతను ఫోటోషూట్‌లో బంధించారు. పర్ఫెక్ట్ షాట్స్‌తో కూడిన ఈ ఫోటో షూట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటో షూట్‌లో పసుపు రంగు గౌనులో అద్భుతంగా కనిపించింది. డబ్బూ ఫోటోషూట్ నుండి  బీటీఎస్ వీడియోను షేర్ చేసింది.
 
తాజా ఫోటో షూట్ చూసి సమంత ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మయోసైటిస్ నుంచి ఆమె బాగానే కోలుకుంది. ఈ నేపథ్యంలో సమంత ఆరోగ్య సమస్యపై పురోగతిని చూపడం చూసి ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ ఫోటోషూట్‌లో ఆమె చిరునవ్వుతో కూడిన వీడియోను చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవలే యశోద చిత్రంతో విజయవంతమైన సమంత, భారీ అంచనాలున్న చిత్రం శకుంతలం సినిమా పనుల్లో వుంది.