1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (17:00 IST)

సమంత ముందులా మారాలి.. ఫ్యాన్స్ ఆకాంక్ష

Samantha
సమంత రూత్ ప్రభు నటించిన శాకుంతలం చిత్రం త్వరలో థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. గతేడాది యశోద సినిమాతో ప్రేక్షకులను పలకరించింది సామ్. ఇప్పుడు ఆమె గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే పీరియాడికల్ డ్రామాతో ప్రేక్షకులను అలరించనుంది. 
 
మయోసైటిస్ దాడి తర్వాత సమంత మరింత సెన్సిటివ్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆమె మాట్లాడే విధానానికి, ఇప్పుడు మాట్లాడే విధానానికి చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు కూడా శాకుంతలం కార్యక్రమంలో సమంత రూత్ ప్రభుని చూసిన ప్రతి ఒక్కరూ ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 
 
ఇటీవల, సమంతా విమానాశ్రయంలో కనిపించింది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సామ్ ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించింది. సమంతను ముందులా చూడాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఆమె పూర్తిగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.