సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (22:16 IST)

నా భర్తకు పెళ్లయిన విషయం ముందుగానే తెలుసు : హన్సిక

hansika
తన భర్త సొహైల్‌కు ఓ పెళ్లైన విషయం తనకు ముందుగానే తెలుసని హీరోయిన్ హన్సిక అన్నారు. అయితే, ఆయన తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి తాను ఎంత మాత్రం కారణం కాదని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయంలో జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని చెప్పారు.
 
దక్షిణాది చిత్రసీమలో ప్రముఖ హీరోయిన్‌గా ఉన్న హన్సిక ఇటీవల తన ప్రియుడు సొహైల్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. అయితే, ఆయనకు గతంలోనే ఓ వివాహం జరిగింది. అతడి వైవాహిక జీవితం విచ్ఛిన్న కావడానికి హన్సికనే కారణమంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ, విస్తృతంగా ప్రచారం సాగుతోంది. అలాగే, మొదటి పెళ్లికి సంబంధించి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. 
 
దీనిపై హన్సిక స్పందించారు. సొహైల్ గురించి జరుగుతున్న ప్రచారం మొదట్లో తనను ఆందోళనకు గురిచేసిందన్నారు. అయితే, తన ఇచ్చిన ధైర్యం, సలహాలు తనను ముందుకు నడిపించేలా చేశాయన్నారు. ఆ తర్వాత తమ పెళ్లి ఫోటోలను ఇన్‌స్టాగ్రాములో షేర్ చేసినట్టు తెలిపారు.