శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 ఫిబ్రవరి 2023 (13:19 IST)

బంగారం కొనేవారికి శుభవార్త... వరుసగా ఆరో రోజు పసిడి పడిపోయింది..

gold coins
బంగారం కొనేవారికి శుభవార్త. వేసవిలో పెళ్ళిళ్లు పెట్టుకున్న వారు బంగారం కొనాలంటే.. ఇప్పుడే పసిడిని కొనడం మంచిది. ఎందుకంటే.. వరుసగా ఆరో రోజు బంగారం ధర తగ్గుముఖం పట్టింది. ఈ ఆరు రోజుల్లో తులం బంగారం రూ. రూ.700 వరకూ తగ్గింది. 
 
శనివారం 22 క్యారెట్ల బంగారం ధర (పది గ్రాములు)పై రూ. వంద వరకు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (పది గ్రాములు) రూ.51,500గా ఉంది. వెండి ధరలు కూడా తగ్గాయి. హైదరాబాదులో కిలో వెండి ధర రూ. 70,900 పలుకుతోంది.
 
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (పది గ్రాములు) రూ.51,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (పది గ్రాములు) రూ.56,510 పలుకుతోంది. వెండి ధర కాస్త తగ్గింది. కిలో వెండి రూ. 500 వరకూ దిగివచ్చింది.