శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (10:39 IST)

ఈ రోజు సాయంత్రం 4 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవా టిక్కెట్లు విడుదల

tirumala
కలియుగ వైకుంఠంగా పేర్కొనే శ్రీ శ్రీనివాసుడు కొలువైవున్న తిరుమలలో శ్రీవారి దర్శన టిక్కెట్లను శుక్రవారం విడుదల చేయనున్నారు. మార్చి నెల కోటాకు సంబంధించి 300 రూపాయల టిక్కెట్లను ఆన్‌లైన్‌ కోటాను శుక్రవారం ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. 
 
ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఏప్రిల్, మే నెలకు సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లను జారీచేస్తారు. సాయంత్రం 4 గంటలకు వర్చువల్ సేవా టిక్కెట్ల కోటాను రిలీజ్ చేసేలా తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులు ఏర్పాట్లు చేశారు.
 
ఇకపోతే, మార్చి నెలకుగాను కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరా సేవ వర్చువల్ సేవా టిక్కెట్ల కోటాను శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలుక ఆన్‌లోనే ఉంచుతామని తితిదే అధికారులు విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు