దశావతార వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న జనసేనాని
గుంటూరు జిల్లా నంబూరు మండల పరిధిలోని దశావతార వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సందర్శించుకున్నారు. ఆదివారం తొలి ఏకాదశిని పురస్కరించుకొని ఆయన స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయానికి చేరుకున్న పవన్ కల్యాణ్‌కి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో జనసేనాని పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం పవన్ కల్యాణ్‌కి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించారు.