1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Telangana corona update

రోజూ కరోనా బులిటెన్ లేదు.. వారానికి ఒక్కసారే...

Telangana
దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కరోనా కేసులు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. మరీ ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళలో అత్యధికంగా కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. దీంతో మొత్తం 7 రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. తెలంగాణలో కూడా కొత్త వేరియంట్ కరోనా కేసులు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇక దేశంలో మరోసారి కరుణ విజృంభణ మొదలైనట్లు చెబుతున్నారు.
 
ఇక మరోవైపు గత ఏడాది మార్చి రెండో తారీకు నుంచి ప్రతి రోజు క్రమం తప్పకుండా ఇస్తున్న కరోనా బులెటిన్‌ను తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. ఇక నుంచి వారానికి ఒకసారి మాత్రమే కరోనా బులిటెన్ రిలీజ్ చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. రోజు తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఇక మీదట వారానికి ఒకసారి మాత్రమే కరోనా బులిటెన్ విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ప్రధానిగారూ... మీరు జోక్యం చేసుకోండి.. కర్నాటక ఆంక్షలు తగదు : సీఎం విజయ్