రాజస్థాన్‌లో తెలుగు విద్యార్థులు.. బిస్కెట్లు తిని బతుకుతున్నారు..
Students
రాజస్థాన్‌లో కరోనా విజృంభిస్తుండటంతో తినడానికి ఏం దొరక్క బిస్కెట్లు తిని ఉంటున్నామని తెలుపుతూ తమ ఆవేదనతో కూడిన వీడియో సందేశాన్ని తెలుగు రాష్ట్రాల సీఎంలకు పంపించారు.
ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు తమ విద్యార్థుల్ని తీసుకెళ్లాయనీ.. తమను కూడా స్వరాష్ట్రాలకు తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్‌ను కోరారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
