గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 ఏప్రియల్ 2020 (15:56 IST)

తెలుగు రాష్ట్రాలకు 'కరోనా' సాయం ప్రకటించిన తమిళ హీరో

రెండు తెలుగు రాష్ట్రాలకు తమిళ హీరో విజయ్ ఆర్థిక సాయం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రూ.5 లక్షలు చొప్పున మొత్తం 10 లక్షల ఆర్థిక సాయాన్ని హీరో విజయ్ ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆయన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి పంపించనున్నారు. 
 
అలాగే, పీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షలతో పాటు తమిళనాడుకు రూ.50 లక్షలు, కేరళకు రూ.10 లక్షలు, కర్ణాటకకు రూ.5 లక్షలు, పాండిచ్చేరికి రూ.5 లక్షలు, ఫెప్సీకి రూ.25 లక్షలు చొప్పున విజయం ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెల్సిందే.
 
'కరోనా’ వ్యాప్తి చెందకుండా చేస్తున్న పోరాటానికి విజయ్ ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడంపై ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
 
అలాగే తెలుగు హీరో అల్లు అర్జున్ కూడా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. కేరళ రాష్ట్రానికి కూడా ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెల్సిందే. తన మాతృభాషతో పాటు.. ఇతర రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు ఆర్థిక సాయం ప్రకటించిన హీరోలు వీరిద్దరే కావడం గమనార్హం.