మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (13:25 IST)

తెలుగు రాష్ట్రాలకు బాలయ్య భారీ విరాళం, రూ. 1 కోటి, చిరంజీవి ట్రస్టుకి రూ. 50 లక్షలు

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపధ్యంలో ఆ వైరస్ ను కట్టడి చేసేందుకు కేంద్రం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో వేలకోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతోంది. మరోవైపు ప్రజలను ఈ వైరస్ నుంచి రక్షించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి. ఈ నేపధ్యంలో ఖజానాపై భారీగా భారం పడుతోంది. ప్రభుత్వాలకు తమవంతు సాయంగా విరాళాలు ప్రకటిస్తున్నారు దాతలు.
 
ఈ ప్రయత్నానికి తాము సైతం చేదోడువాదోడుగా ఉంటామని సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీల నుంచి ఇప్పటికే చాలామంది సినిమా స్టార్స్ ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చారు. 
 
తాజాగా సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రూ.1.25 కోట్ల విరాళం అందించారు. ఈ విరాళంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధులకు కోటి రూపాయలు, సినీ కార్మికుల కోసం చిరంజీవి చారిటబుల్ ట్రస్టుకి రూ. 25 లక్షలు ఇస్తున్నట్టుగా బాలకృష్ణ పేర్కొన్నారు.