సంబంధిత వార్తలు
- అందరికీ కరోనా టీకా ఇవ్వరట.. మాస్కులతో రక్షణ పొందాలి... తేల్చి చెప్పిన కేంద్రం
- ఆయన 'అనంత చంద్రుడు'... జిల్లా నుంచి ఢిల్లీ వరకూ ప్రశంసలందుకున్న గంధం చంద్రుడు ఐఏఎస్
- మేం కట్టిన ఇళ్లకు వైకాపా స్టిక్కర్లేసారు: బాబు, మీకు నరకంలో కూడా చోటు దక్కదు: జగన్
- ఒకరి మీద ఒకరు పడి పాలు పితకడం, అవినాష్ మైండ్ గేమ్
- ఇతను కండల వీరుడా..? కలెక్టరా..? వామ్మో సిక్స్ ప్యాక్ అదిరింది..? (Video)
కరోనా వ్యాక్సిన్‌కు బ్రిటన్ గ్రీన్ సిగ్నల్.. వచ్చేవారంలో ఫైజర్ వచ్చేస్తోంది..
కరోనా వ్యాక్సిన్ వినియోగానికి బ్రిటన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రపంచంలోనే తొలిసారి ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ వినియోగానికి రానుంది. వచ్చే వారంలోనే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ఫైజర్-బయోఎన్‌టెక్ కరోనా వైరస్ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతించాలని మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రోడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ) చేసిన సిఫారసును బ్రిటన్ ప్రభుత్వం ఆమోదించింది.
యునైటెడ్ కింగ్‌డమ్ వ్యాప్తంగా వచ్చే వారం నుంచే ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి సాధించడంపై ఫైజర్ సీఈవో ఆల్బర్ట్ బౌర్లా సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన ఎంహెచ్ఆర్ఏకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తాము మరిన్ని దేశాల అనుమతుల కోసం ఎదురు చూస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ నాణ్యత ఉన్న వ్యాక్సిన్‌లను అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే బ్రిటన్‌లోని ఆసుపత్రులన్నీ వ్యాక్సిన్ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని, వచ్చే వారంలోనే ఈ కార్యక్రమం మొదలవుతుందని బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి మ్యాట్ హ్యాన్‌కాక్ చెప్పారు.
