సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: మంగళవారం, 1 డిశెంబరు 2020 (18:19 IST)

ఒకరి మీద ఒకరు పడి పాలు పితకడం, అవినాష్ మైండ్ గేమ్

బిగ్ బాస్ 4లో అభిజిత్‌తో పాటు అవినాష్ కూడా ముందున్నాడు. కొంతమంది సభ్యులు ఆడుతున్న ఆటతో అవినాష్‌కు బాగా చిర్రెత్తుకొస్తోందట. ముఖ్యంగా అఖిల్, సొహైల్‌లు అవినాష్‌కు కోపం తెప్పించే విధంగా చేస్తున్నారట. దీంతో అవినాష్ కూడా మైండ్ గేమ్ మొదలుపెట్టాడంటున్నారు విశ్లేషకులు.
 
టిక్కెట్టు టు ఫినాలే.. ఫస్ట్ లెవల్ బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇచ్చిన పస లేని టాస్క్ ఇదేనట. అసలు ఈ టాస్క్ ఇద్దరి మధ్య గొడవలకు కారణమవుతోందట. ఒకరి మీద ఒకరు పడి పాలు పితకడం ఈ టాస్క్. అయితే. ఇందులో సోహైల్, అఖిల్‌లు అవినాష్‌ను బాగా బుక్ చేస్తున్నారట. 
 
అవినాష్ పాల టిన్‌ను తీసి పక్కకు పారేస్తుండటం అతనికి బాగా కోపం తెప్పిస్తోంది. కావాలనే అతన్ని టార్గెట్ చేస్తూ వీరు ఆటలాడుతున్నారని అభిమానులు సందేశాలు పంపిస్తున్నారట. మీరు నన్ను ఎలిమినేట్ చేయండి.. నేను హౌస్‌లో ఉండను అంటూ గట్టిగా అరుస్తూ గొడవకు దిగుతున్నాడట. ఇదంతా అభిమానుల్లో సింపతీ కోసం ఇలా చేస్తున్నారని అనుకుంటున్నారు విశ్లేషకులు. దీంతో అవినాష్ కూడా మైండ్ గేమ్ ప్రదర్సిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.