సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Updated : బుధవారం, 18 నవంబరు 2020 (16:53 IST)

బిగ్ బాస్ షోలో 9 సార్లు మోనాల్ గజ్జర్, ఏడుసార్లు హారిక

బిగ్ బాస్ షో. ప్రతిరోజు ఈ షో చూసేవారికి ఒక పండుగే. అందుకే ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా చాలామంది అభిమానులు మొదటి రోజు నుంచి ఇప్పటివరకు నిరంతరం చూస్తూనే ఉన్నారు. ఏ ఎపిసోడ్‌ను మిస్ కాకుండా ఫాలో అవుతున్నవారు చాలామంది వుంటున్నారు. ఓటింగ్ చేస్తున్నారు. తమకు ఇష్టమైన వారు హౌస్‌లో ఉండే విధంగా ఓట్లు వేస్తున్నారు. 
 
ఇదంతా బాగానే ఉంది. కానీ బిగ్ బాస్ హౌస్‌లో పదేపదే నామినేట్ అవుతున్న వారిలో మొదటి పేరు అభిజిత్. ఇప్పటివరకు అతనే హౌస్‌లో ఎక్కువగా నామినేట్ అయి తిరిగి మళ్ళీ హౌస్ లోనే ఉంటున్నాడు. ఇక మోనాల్ గజ్జర్.. ఈమెది కూడా సపరేట్ రూట్. ఈమధ్య ఈమెకు కోపం ఎక్కువవుతున్నట్లుంది.
 
అందుకే మోనాల్‌ను 9సార్లు నామినేట్ చేశారట. అయినాసరే ఎలాగోలా హౌస్ లోనే ఉండిపోతోంది. ఆమెకు అభిమానులు ఉన్నారు కదా. ఇక హారిక. ఈమె ఏడుసార్లు. తన ఆటతీరుతో అందరినీ మెప్పిస్తున్న హారిక కోసం ప్రేక్షకులు బాగానే ఓట్లేస్తున్నారట. అది బాగా ఆమెకు కలిసొస్తోందట.