సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 26 నవంబరు 2020 (11:47 IST)

మోనాల్‌తో డేటింగ్ నావల్ల కాదన్న అభిజిత్, నేను ఓకేనన్న అఖిల్, సొహైల్ షర్ట్ విప్పాడు

బిగ్ బాస్ 4 తెలుగు కూడా డేటింగులకు వచ్చేసింది. బాలీవుడ్లోనే ఇలాంటి టాస్కులున్నాయనుకుంటే ఇపుడు తెలుగులోనూ ఆ టాస్కులను ఇచ్చేసాడు బిగ్ బాస్. లగ్జరీ టాస్కులో బిగ్ బాస్ మోనాల్ గజ్జర్‌తో డేటింగుకు వెళ్లే అవకాశాన్ని అభిజిత్ కు వచ్చింది.
 
ఐతే మోనాల్‌తో డేటింగ్ నావల్ల కాదని అభిజిత్ చేతులెత్తేయడంతో ఆ అవకాశాన్ని బాస్ అఖిల్ కు ఇచ్చాడు. వచ్చిందే తడవుగా అఖిల్ ఆమెను గార్డెన్ ఏరియాలోకి తీసుకెళ్లాడు. తను ఎలాంటి వాడినో చెపుతూ పులిహోర కలపడం ప్రారంభించాడు. అదలావుండగానే నందికొండవాగుల్లోన అనే పాట వచ్చింది. దీనితో సొహైల్ ఆనందంతో షర్ట్ విప్పి చిందులేశాడు.