గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 నవంబరు 2020 (20:09 IST)

వినయ్‌కి ''ఐ లవ్ యూ'' చెప్పిన అరియానా.. షాకైన అవినాష్..?!

తెలుగు బిగ్ బాస్ నాలుగో సీజన్ చివరి దశకు చేరుకుంది. టాస్క్‌లతో ఎప్పుడూ గోలగోలగా వుండిన బిగ్ బాస్ హౌస్ 74వ రోజు కంటెస్టెంట్‌ల ఇంటి సభ్యులు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఒక్కొక్కరిగా వస్తూ వారి కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడారు. ఈ నేపథ్యంలో వినయ్ హౌస్‌లోకి ప్రవేశించాడు. వినయ్‌ను చూడగానే అరియానా టాస్క్‌ను కూడా వదిలేసి పరుగెత్తుకెంటూ వెళ్లింది. 
 
వినయ్ అరియానా కోసం హౌస్‌లోకి వెళ్లగా ఆమె వినయ్ అంటూ ఎంతో ప్రేమతో అతని వద్దకు వచ్చింది. అద్దం మధ్యలో ఉండగా వినయ్‌ని చూస్తూ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టింది. అంతేగాకుండా వినయ్ ఐ లవ్ యూ అంటూ ఇంటి సభ్యుల ముందే చెప్పేసింది. ఈ మాట విన్న అవినాష్ షాక్ అయ్యాడు. ఆపై అరియానా తనకు మంచి స్నేహితురాలంటూ కామ్‌గా వుండిపోయాడు. 
 
ఇక మోనాల్ అక్క వచ్చి ఏదైనా ఉంటే బయటికి మాట్లాడండి అంటూ... అభిజిత్‌కు చిన్న వార్నింగ్ ఇచ్చినట్లు అనిపించింది. సోహెల్ వాళ్ళ నాన్నను బిగ్ బాస్ ఇంటిలో చూసి సందడి చేశాడు. ఈ ఎపిసోడ్‌లో అరియానానే హైలైట్‌గా నిలిచింది.