సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: మంగళవారం, 6 అక్టోబరు 2020 (21:55 IST)

ఎందుకు ఆలోచిస్తున్నావు? నేరుగా నా నోట్లో పెట్టు: బిగ్ బాస్ హౌసులో కొత్త ప్రేమజంట

బిగ్ బాస్ షోలో ఇప్పటికే కొంతమంది ప్రేమించుకుంటున్నారు. అందులో అభిజిత్, మోనల్, అఖిల్ సార్థక్ మధ్య ట్రయాంగిల్ స్టోరీ నడుస్తోంది. దీనిపైన ఇప్పటికే రచ్చ రచ్చ నడుస్తోంది. కానీ ఇప్పుడు కొత్తగా అవినాష్, అరియానా మధ్య లవ్ ట్రాక్ ఎక్కింది.
 
ప్రేమగా తినిపించుకునే స్థాయికి వెళ్ళింది. ఎంతో ఇష్టంగా దోసెలు వేసి మరీ అవినాష్ అరియానాకు తినిపించాడు. మొదట్లో ఆలోచనలో పడ్డాడు అవినాష్. కానీ అరియానా ఎందుకు ఆలోచిస్తున్నావు, నేరుగా నా నోట్లో దోసె పెట్టు అంది. అంతే, ఎగిరి గంతేసినంత పనిచేసి అవినాష్ ఆమెకు తినిపించడం ప్రారంభించాడు.
 
వీరిద్దరి మధ్య ప్రేమాయణం ఇప్పుడు హౌస్‌లో పెద్ద రచ్చే నడుస్తోంది. అంతేకాదు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే అవినాష్ ఎలిమినేట్ విషయంలో దురుసుగా ప్రవర్తించారని అందరూ అనుకుంటున్నారు. కానీ లవ్ యాంగిల్‌లో మాత్రం బాగా అదరగొడుతున్నారంటున్నారు. ఇది బాగానే ఉన్నా కొంతమంది ప్రేక్షకులు మాత్రం ఇదంతా డ్రామా లవ్ అంటూ సందేశాలను పంపుతున్నారట.