సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి

బిగ్ బాస్ సీజన్ 4: 30 ఎపిసోడ్ హైలైట్స్.. లాస్య పప్పు వండడం వలన అందరికీ..?

బిగ్ బాస్ సీజన్ 4 30 ఎపిసోడ్ హైలైట్స్‌పైనే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. సోమవారం రోజు ఎపిసోడ్‌లో అందరు బయటకు వచ్చి డ్యాన్స్‌లు చేయగా, నోయల్ అలానే పడుకున్నాడు. దీంతో బిగ్ బాస్ కుక్కలు మొరిగాయి. అప్పుడు మనోడు మేల్కొన్నాడు. ఇక సోమవారం అంటే నామినేషన్స్ రచ్చ తప్పక ఉంటుంది. అందుకు తగ్గట్టు హౌజ్‌మేట్స్ ముందే సిద్ధమయ్యారు. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ కోసం ఒక్కో ఇంటి సభ్యుడు ఇద్దరిని నామినేట్ చేస్తూ వారి ముఖంపై ఫోమ్ పూయాలని చెప్పారు.
 
ముందుగా అఖిల్‌ని పిలవడంతో తాను అభిజిత్ ముఖంపై ఫోమ్ పూసాడు. ఒరేయ్ అన్న విషయంతో ఇద్దరి మధ్య మొదలైన వాగ్వాదం చదువు, క్వాలిఫికేషన్‌, అమ్మాయి, వెనుక మాట్లాడడం వంటి విషయాల వరకు వెళ్ళింది. కొద్ది సేపు ఇద్దరి మధ్య రచ్చ జరిగింది. ఆ తర్వాత మరో కంటెస్టెంట్‌గా రాజశేఖర్ మాస్టర్‌ని నామినేట్ చేశాడు అఖిల్. ఆయన చేస్తే కరెక్ట్ వేరే వాళ్లు చేస్తే తప్పు అన్న ధోరణిలో మాస్టర్‌లో ఉన్నారు, ఇది నాకు నచ్చలేదు అని అఖిల్ పేర్కొన్నాడు.
 
తర్వాత వచ్చిన అరియానా గ్లోరీ.. రాజశేఖర్ మాస్టర్, అఖిల్‌లను నామినేట్ చేసింది. మాస్టర్ కిచెన్‌లో ఉన్నప్పుడు నెగెటివ్‌గా మాట్లాడారని, అందుకే అతనిని నామినేట్ చేసానని చెప్పింది. ఇక లగ్జరీ బడ్జెట్ విషయంలో అఖిల్‌ని నామినేట్ చేస్తున్నట్టు పేర్కొంది. ఇక లాస్య.. దివి, నోయల్‌కి ఫోం పూసి నామినేట్ చేసింది. దివి కుక్ చేసే సమయంలో నీట్‌గా మెయింటైన్ చేయడం లేదు ఆ కారణంగా నామినేట్ చేస్తున్నాను. నోయల్ నన్ను ఫేక్ అనడం చాలా బాధని కలిగించింది. ఆ కారణంగా నామినేట్ చేస్తున్నాను అంటూ లాస్య పేర్కొంది.
 
అవినాష్ .. అఖిల్‌తో పాటు మోనాల్‌ని నామినేట్ చేశాడు. అఖిల్ నామినేట్ చేయడానికి లగ్జరీ బడ్జెట్ కారణం అని అవినాష్ చెప్పడంతో అఖిల్ ఫైర్ అయ్యాడు. స్మార్ట్ గేమ్ ఆడుతున్నారని, ఇదే విషయం ముందు ఎందుకు చెప్పలేదు అని అన్నాడు. ఇద్దరి మధ్య కొద్ది సేపు చర్చ జరిగిన తర్వాత మోనాల్‌ని నామినేట్ చేశాడు అవినాష్‌. హిట్ మ్యాన్ గేమ్‌లో నేను సేఫ్ గేమ్ ఆడుతున్నాని అని మోనాల్ అనడం నాకు నచ్చకపోవడంతో నామినేట్ చేశానని అవినాష్ పేర్కొన్నాడు.
 
సుజాత.. అఖిల్‌,అరియానాలని నామినేట్ చేసింది. అఖిల్‌ని నామినేట్ చేయడానికి లగ్జరీ బడ్జెట్‌నే కారణంగా చూపించిన సుజాత.. అరియానాని చిన్న కారణంతో నామినేట్ చేసింది. ఇక కుమార్ సాయి.. నోయల్‌, సుజాతలను నామినేట్ చేశాడు. నోయల్ పాత కారణాన్ని పదే పదే తవ్వుతున్నాడు. అది నాకు నచ్చలేదు. ఇక సుజాత నచ్చిన వారితో బాగా ఉంటూ, డిపెండింగ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. ఈ కారణంతోనే వారిద్దరిని నామినేట్ చేసాను అని కుమార్ సాయి పేర్కొన్నారు.
 
సోహైల్.. అభిజిత్‌,నోయల్‌లని నామినేట్ చేశాడు. వాష్ రూం క్లీనింగ్ విషయంలో అభిజిత్ ప్రవర్తన నచ్చక ఇతనిని నామినేట్ చేసిన సోహైల్‌, కాయిన్ టాస్క్ విషయంలో నోయల్ వైఖరి కాస్త డిఫరెంట్‌గా అనిపించడంతో నామినేట్ చేశానని పేర్కొన్నాడు. మెహబూబ్‌.. సుజాత, లాస్యలను నామినేట్ చేశాడు. తన పాయింట్స్ అన్నీ స్విచ్ కాయిన్ ద్వారా సుజాత తీసుకున్నందుకు ఆమెని నామినేట్ చేసిన మెహబూబ్.. లాస్యని నామినేట్ చేయడానికి కారణం టాస్క్ విషయంలో తను చేసిన చీటింగ్ ప్రధాన కారణమని అన్నాడు.
 
గంగవ్వ.. నోయల్‌, అభిజిత్‌లను నామినేట్ చేసింది. నోయల్‌.. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు కనిపిస్తున్నాడు. అందుకే అతనిని నామినేట్ చేశాను. ఇక అభిజిత్ ఒక్కడే కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరితో కలవడు అందుకే అభిని నామినేట్ చేసానని గంగవ్వ తెలిపింది. రాజశేఖర్ మాస్టర్.. అఖిల్‌, అరియానాలను నామినేట్ చేశారు. లాస్య కష్టపడినట్టుగా అరియానా కిచెన్‌లో చేయడం లేదని చెప్పారు.
 
హారిక.. అఖిల్‌, మోనాల్‌లని నామినేట్ చేసింది. అఖిల్ ఎక్స్‌ప్రెషన్స్ తనకు నచ్చడం లేదని, అతనితో మాట్లాడాలి అంటే వేరే వ్యక్తిని దాటి వెళ్లాల్సి వస్తుందని హారిక తెలిపింది. చాలా అటిట్యూడ్ కూడా చూపిస్తాడంటూ మండిపడింది. దీనికి అఖిల్ కూడా గట్టి కౌంటర్ ఇచ్చాడు. నా ముఖమే అంతా. నీ కోసం నా ముఖాన్ని మార్చుకోలేను కదా. అయిన నాకు చెప్పే రైట్ కూడా నీకు లేదంటూ ఇద్దరు కాసేపు గొడవ పడ్డారు. ఆ తర్వాత మోనాల్‌ని నామినేట్ చేసిన హారిక.. ఎప్పుడు తన ఫీలింగ్స్ గురించే ఆలోచిస్తుందే తప్ప వేరే వాళ్ళని అర్ధం చేసుకోదని తెలిపింది.
 
దివి.. లాస్య, సోహైల్‌లని నామినేట్ చేసింది. లాస్య పప్పు వండడం వలన అందరికి మోషన్స్ అయ్యాయని అందుకే నామినేట్ చేసానని పేర్కొంది. అయితే దీనిని లాస్య ఖండించింది. నేను వంట చేస్తే మోషన్స్ అయ్యాయంటే అస్సలు ఒప్పుకోను. ఫ్రిజ్‌లో ఉన్న పప్పు వేడి చేసుకొని తినాల్సింది అని అంది. పక్కనే ఉన్న గంగవ్వ కూడా దివికి చురకలు అంటించింది. అంత చేసి పెడితే ఇలా అంటారేంటి, నచ్చకపోతే వేరేవి తెప్పించుకొని తినమని అంది. ఇక రెండో వ్యక్తిగా సోహైల్‌ని నామినేట్ చేసిన దివి.. అతని వలన హర్ట్ అయ్యాను. కాలికి తగిలిన దెబ్బ కూడా ఇంక తగ్గ లేదు అంటూ చెప్పుకొచ్చింది.
 
మోనాల్‌.. హారిక, అవినాష్‌లను నామినేట్ చేసింది. హారిక నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడం నాకు నచ్చలేదు. అభితో ప్రాబ్లం ఉంటే అతనితోనే డైరెక్ట్‌గా మాట్లాడతా, నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ కావడం నాకు నచ్చలేదు. నాలో తప్పులుంటే నేను సరిచేసుకుంటా అంటూ మోనాల్ తెలిపింది. ఇక అవినాష్ కామెడీ నాకు హర్టింగ్‌గా ఉంటుంది. అందుకే అతనిని నామినేట్ చేసానని మోనాల్ పేర్కొంది. దీనికి స్పందించిన అవినాష్ నేను ఎప్పుడు హెల్తీ కామెడీనే చేస్తానే తప్ప ఎవరిని కించపరిచేలా కామెడీ చేయలేదు. మీరు మాట్లాడే మాటలు నా అభిమానులు తట్టుకోలేరు. వేరే వాళ్ళ మీద చేసినప్పుడు అక్కడ ఉండి నవ్వుతుంటారు కదా అని అవినాష్ పేర్కొన్నాడు. అయితే ఒకసారికి ఒకే ఊరికే చేసిన బాగుండదు అంటూ అవినాష్‌కు చెప్పుకొచ్చింది మోనాల్
 
అభిజిత్‌.. సోహైల్‌, అఖిల్‌లని నామినేట్ చేశాడు. అఖిల్‌ని నామినేట్ చేసే సమయంలో పెద్ద రచ్చే అయింది. చివరిగా వచ్చిన నోయల్‌.. చివరిగా వచ్చిన నోయల్.. నామినేట్ చేస్తే పాయింట్ ఉండాలని ఏదో చేసాం అనేలా ఉండొద్దని హితబోధ చేశాడు. రాజశేఖర్ మాస్టర్‌ని నామినేట్ చేసిన తర్వాత సోహైల్‌, నోయల్‌కు వాగ్వాదం జరిగింది. స్వాతిని ఎలిమినేట్ చేసినందుకు రాజశేఖర్ మాస్టర్‌తో నోయల్ చర్చ చేస్తుండగా, మధ్యలో దూరిన సోహైల్‌.. మెహబూబ్‌తో నాకున్న రిలేషన్ గురించి అప్పుడేదో అన్నావు. ఇప్పుడు స్వాతిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అన్నాడు. ఈ విషయంలో ఫైర్ అయిన నోయల్.. సోహైల్‌ని నామినేట్ చేశాడు.
 
నామినేట్ చేస్తూ ఇంటి సభ్యులకు హితోపదేశం చేశాడు.. సొహైల్ తనను నామినేట్ చేసినా తనని నామినేట్ చేయడం లేదని.. నామినేషన్ అంటే పాయింట్ ఉండాలని.. ఇంటి నుంచి వెళిపోవడానికి సరైనా పాయింట్ ఉండాలని చెప్పాడు. రాజశేఖర్ మాస్టర్‌ని నామినేట్ చేసి ట్విస్ట్ ఇచ్చాడు నోయల్. ఎలిమినేట్ అయిన స్వాతిని అకారణంగా నామినేట్ చేశారని.. అతని వల్ల ఒక మొక్క ఎదగ కుండానే వెళ్లిపోయిందని అందుకే ఎలిమినేట్ చేస్తున్నట్టు చెప్పాడు నోయల్. అయితే నువ్ స్వాతి విషయం మాట్లాడితే తప్పని అన్నావు.. మరి నువ్ ఇప్పుడు స్వాతి గురించి ఎందుకు మాట్లాడుతున్నావ్ అని సొహైల్ పాయింట్ రైజ్ చేయడంతో హర్ట్ అయిన నోయల్ తిరిగి సొహైల్‌నే నామినేట్ చేశాడు.
 
మొత్తానికి గరంగరంగా జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఐదోవారం నామినేషన్స్‌లో అఖిల్, నోయల్, అభిజిత్, సొహైల్, రాజశేఖర్, మోనాల్, లాస్య, సుజాత, అరియానాలు నిలిచారు. వీరిలో వచ్చే వారం ఎవరుంటారో లేదో వేచి చూడాలి.