మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 మే 2020 (14:36 IST)

నాకు బాయ్‌ఫ్రెండా.. నిధి అగర్వాల్ ఏమంటుంది?

కరోనా వైరస్ కారణంగా సెలెబ్రిటీలు ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇంకా వీడియోలను పోస్టు చేస్తున్నారు. ఇంకా అభిమానులతో చిట్ చాట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేస్తున్నారు. 
 
తాజాగా ఇస్మార్ట్ శంకర్ ఫుల్ క్రేజ్ పొందిన నిధి అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజన్స్‌తో చాట్ చేసింది. ప్రస్తుతం బెంగళూరులోని తన ఇంట్లో నివాసం ఉన్నట్టు చెప్పిన నిధి తనకి బాయ్ ఫ్రెండ్ లేడని, ఎలాంటి రిలేషన్ షిప్‌లో లేరని పేర్కొంది. 
 
ప్రస్తుతం నిధి తెలుగులో అశోక్ గల్లా సరసన ఓ చిత్రం తమిళంలో జయం రవి సరసన భూమి అనే చిత్రంలో నటిస్తోంది. ఇంకా లాక్‌డౌన్‌ విరామంలో ఆన్‌లైన్‌ ద్వారా నటనలో శిక్షణ తీసుకుంటూ బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చింది. 
 
ప్రభుత్వ సూచనల్ని పాటిస్తూ ఇంటికే పరిమితమైన ఆమె పీఏం కేర్స్‌, సీఏం రిలీఫ్‌ ఫండ్‌తో పాటు సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సీసీసీకి విరాళాన్ని అందజేసింది. అలాగే వెల్ఫేర్‌ ఆఫ్‌ స్ట్రే డాగ్స్‌, స్ఫూర్తి సంక్షేమ సంఘానికి సహాయాన్ని చేసినట్లు ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రకటించింది.