శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 మే 2020 (13:16 IST)

కరోనా వైరస్.. ఆంధ్రాకు వెళ్ళొద్దు.. కేసీఆర్ వార్నింగ్

కరోనాను అదుపులో వుంచేందుకు తెలంగాణ సర్కారు చర్యలను వేగవంతం చేసింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రజలను సరిహద్దు గ్రామాల ప్రజలు అడ్డుకుంటున్నారు. ఇటీవల ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చిన వలస కూలీలను సరిహద్దు ప్రజలు అడ్డుకుంటున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
 
ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు తెలంగాణ ప్రజలు వెళ్లొద్దని ఆదేశించింది. ఈ రాష్ట్రాలకు వెళ్లడంపై నిషేధం విధించింది. ఖమ్మం, నల్గొండ, జిల్లాల ప్రజలు గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్తుంటారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు కర్నూలుకు వెళ్తుంటారు. దీంతో, వీరి ప్రయాణాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సరిహద్దు చెక్ పోస్టుల వద్ద పోలీసు బలగాలను పెంచింది.
 
కాగా.. ఏపీలోని కర్నూలు, గుంటూరులో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కర్నూలులో 400కు పైగా, గుంటూరులో 300కు పైగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.