శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 మే 2020 (17:00 IST)

కరోనా తగ్గినా.. మాస్క్‌ల వాడకం తప్పదు.. ఏపీ మంత్రి బుగ్గన

కరోనా మహమ్మారి ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చైనా వుహాన్‌లో పుట్టుకొచ్చిన ఈ రోగం.. ప్రపంచ జనాలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కరోనాపై వ్యాఖ్యలు చేశారు. కరోనాతో సహజీవనం తప్పదని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. 
 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చెప్పిన మాటలు అక్షర సత్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అంతే కాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే విషయం చెప్పిందని, మరోవైపు ఫేస్‌ మాస్కులు జీవితంలో భాగమని ప్రధాని నరేంద్ర మోదీ కూడా అన్నారని గుర్తు చేశారు. 
 
కరోనాపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు అక్షరసత్యాలని వ్యాఖ్యానించారు. భవిష్యత్‌లో కరోనా వైరస్ ప్రభావం తగ్గినా మాస్క్‌లు వాడటం తప్పనిసరి అవుతుందని.. ఇది మన ఆరోగ్య రక్షణగా మారుతుందన్నారు. 
 
కరోనా వైరస్‌ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలని జగన్ ఆలోచిస్తుంటే, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌లో కూర్చుని విమర్శలు చేస్తున్నారని అన్నారు. కరోనా వైరస్‌తో ఇబ్బంది పడుతున్న ప్రజలకు టీడీపీ నేతలెవరూ సాయం చేయలేదని విమర్శించారు.